మనిషా, పశువా: జెసి దివాకర్ రెడ్డిపై మండిపడ్డ బొత్స

Botcha fires at JC Diwakar Reddy
Highlights

జెసి మనిషా, పశువా అని బొత్స విరుచుకుపడ్డారు. జెసి ప్రవర్తన పశువుల కన్నా హీనంగా ఉందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టీడీపి నేతలు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. జెసి మనిషా, పశువా అని ఆయన విరుచుకుపడ్డారు.

జెసి ప్రవర్తన పశువుల కన్నా హీనంగా ఉందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టీడీపి నేతలు సభ్యత, సంస్కారం మరిచంి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జెసి లాంటి ఉండబట్టే రాజకీయ నాయకులకు విలువ లేకుండా పోయిందని అన్నారు. 

టీడీపి అవినీతి చరిత్ర అంతా తమకు కతెలుసునని ఆయన అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేయలేకపోయినందుకు టీడీపి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి టీడీపీ నాయకులు ఏం చేశారని ఆయన అడిగారు. ఎన్ని సార్లు ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. 

నాలుగేళ్ల పాటు విశాఖ రైల్వే జోన్ పై టీడీపీ నేతలు ఏం చేశారని, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేద్దామనుకుంటున్నారని ఆయన అడిగారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు దీక్షల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. దమ్ముంటే టీడీపి నాయకులు ఢిల్లీలో దీక్షలు చేయాలని బొత్స సవాల్ చేశారు.

loader