Asianet News TeluguAsianet News Telugu

గంటా లేకపోతే.. అవంతి ఎక్కడ ఉండేవాడో... బొండా ఉమా

అవంతి శ్రీనివాస్.. ఊసరవల్లిలా పార్టీలు మారుతుంటాడని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  బోండా ఉమ అన్నారు. 

bonda uma comments on avanthi srinivas over party change
Author
hyderabad, First Published Feb 18, 2019, 10:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అవంతి శ్రీనివాస్.. ఊసరవల్లిలా పార్టీలు మారుతుంటాడని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  బోండా ఉమ అన్నారు.  నిరంతరం పార్టీలు మారే అవంతికి.. టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు. మంత్రి కావాలనే కోరికతో అవంతి వైసీపీలో అడుగుపెట్టాడని.. అతని కలలు ఎప్పుడూ కల్లలుగానే మారతాయని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ముఖ్య మంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి లేకపోతే.. అవంతి శ్రీనివాస్ అనే అతను అసలు ఎక్కడ ఉండేవాడో తెలుసుకోవాలన్నారు. నోటికివచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

ఒకప్పుడు సీఎం చంద్రబాబు.. తనకు దేవుడితో సమానమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పడు వైసీపీలో చేరి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బోండా ఉమ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన అవంతి.. ఇప్పుడు జగన్ ఉచ్చులో చిక్కుకున్నారని విమర్శించారు.  జగన్ సీఎం అయ్యి.. తనకు మంత్రి పదవి ఇస్తాడని అవంతి కంటున్న కలలు కల్లలుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios