ధర్మవరంలో బాంబుల కలకలం

First Published 23, Dec 2017, 11:20 AM IST
Bomb blast created panic in Dharmavaram
Highlights
  • రెడ్డి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చివరిదశకు వచ్చిన నేపధ్యంలో ధర్మవరంలో బాంబులు పేలటం కలకలం సృష్టించింది.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చివరిదశకు వచ్చిన నేపధ్యంలో ధర్మవరంలో బాంబులు పేలటం కలకలం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే జగన్ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకీ ఏం జరిగిందంటే, అనంతపురం జిల్లా ధర‍్మవరంలో బాంబులు కలకలం సృష‍్టించాయి. ధర‍్మవరం పట‍్టణంలోని బోయవీధి శివారులో శనివారం ఉదయం ఒక బాంబును గుర్తు తెలియని వ‍్యక్తులి విసిరారు. 

జనాలు ఎవరూ లేని చోట అది పేలడంతో పెద‍్ద శబ‍్ధం వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన పరిసరప్రాంత ప్రజలు భయపడిపోయారు. ఏం జరుగుతోందో అర్ధం కాక ఆందోళనతో పరుగులు తీశారు. దట‍్టంగా పోగలు కమ‍్ముకోవడంతో అసలక్కడ  జరుగుతోందో అర్ధంకాక అందరిలోనూ కొద్దిసేపు అమోమయం నెలకొంది. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకున్నారు. బాంబు పేలిన ప్రాంతంలో తినిఖీ చేస్తున్న సమయంలోనే పేలని మరొకొన్ని బాంబులు రోడ్డు పక్కనే కనిపించాయి. దాంతో పీలీసులు ఖంగుతిన్నారు. వాటిని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

loader