విజయనగరంలో కరోనా రోగి మృతి, బెడ్‌పైనే డెడ్‌బాడీ: కరోనా రోగుల్లో ఆందోళన

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనాతో రోగి మరణించినా  రాత్రి నుండే డెడ్‌బాడీ ఆసుప్రతి మంచంపైనే ఉంది. దీంతో ఇదే వార్డులో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు

Body of Covid patient left on hospital bed in vizianagaram

విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనాతో రోగి మరణించినా  రాత్రి నుండే డెడ్‌బాడీ ఆసుప్రతి మంచంపైనే ఉంది. దీంతో ఇదే వార్డులో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా కూడ ఫలితం లేకుండాపోయిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లిమర్లలోని కోవిడ్ సెంటర్ లో  ఓ రోగి చికిత్స కోసం చేరాడు. ఈ సెంటర్ లో చికిత్స పొందుతూ ఆ రోగి గురువారం నాడు రాత్రి మరణించాడు. కోవిడ్ రోగి మరణించిన విషయాన్ని తోటి రోగులు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అయితే అదే బెడ్ పై రోగి మృతదేహం అలానే ఉంచారు. పక్క మంచంలోనే రోగి మృతదేహం పెట్టుకొని తాము  ఇబ్బందులు పడుతున్నట్టుగా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోవిడ్ తో మరణించిన వ్యక్తి డెడ్ బాడీని వెంటనే మార్చురీకి తరలించాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు గతంలో కూడ చోటు చేసుకొన్నాయి.

హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత కారణంగా  ఈ తరహా ఘటన చోటు చేసుకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడ ఇదే తరహా ఘటన గతంలో జరిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios