విశాఖపట్నం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద చోటు చేసుకుంది. గల్లంతైనవారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు.

కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ నేపథ్యంలో వలస కూలీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వలస కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందినవారని తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.