తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు  చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీకొట్టిన  ఓ లాంచీ అనంతరం నదిలో మునిగిపోయింది. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం.

చీమ్మచీకటి కావడంతో లాంచీలో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి  నెలకొంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ సహాయక బృందాలు ఘటాన స్థలికి చేరుకుంటున్నాయి., 

కల్లేరు పంచాయితీకి సరుకులు అందించి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ ను గుద్దుకొని రెండు ముక్కలైన లాంచీ. దీనితో లాంచీలో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.