శ్రీకాకుళం జిల్లాలో పడవ బొల్తా.... ఆరుగురు గల్లంతు.. ముఖ్యమంత్రి ఆరా

First Published 21, Jul 2018, 11:59 AM IST
boat accident in srikakulam district
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వరుస పడవ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద పడవ బొల్తాపడి ఆరుగురు గల్లంతైన ఘటన మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఇవాల మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో వరుస పడవ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద పడవ బొల్తాపడి ఆరుగురు గల్లంతైన ఘటన మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఇవాల మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.. సంతబొమ్మాళి మండలం ఉమిలాడ తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనాలని.. బాధితులకు సాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 

loader