కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంబవించింది.ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

తాళ్లరేవులో శుక్రవారం నాడు ఓ బాణసంచా తయారీ  చేస్తున్న సమయంలో  షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.ఈ షార్ట్ సర్క్యూట్ తో  బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో బాణసంచా పేలుడులో బాణసంచా దుకాణం నిర్వహకుడితో పాటు 9 మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

నెల రోజుల  క్రితం తూర్పు గోదావరి జిల్లాలోని వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు.మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం.

ఈ ఘటన తర్వాత అగ్నిమాపక సిబ్బంది సరైన విధంగా తనిఖీలే చేయని కారణంగా అదే రకమైన ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండానే బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వంటి ఘటనలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. 

ఇటీవలనే కొత్తపేట ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాలపై అగ్నిమాపక అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వల్ల ఈ తరహా ప్రమాదాలు చోటు చుేసుకొంటున్నాయని  స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలోనే అధికారులు హాడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుందని స్థానికులు అభిప్రాయంతో ఉన్నారు.