తాడేపల్లి, జగజ్జివన్ రావు కాలనీలో  గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు.

స్థానికులు అడ్డుకోవడంతో, స్థానికులపై కూడా యువకులు  దాడి చేశారు. అనంతరం ఓ మహిళ మెడలో బంగారు చైన్ ను లాక్కొని యువకులు పరారయ్యారు.  బాధితులు పొలీస్ స్టేషన్లో 5 గురు యువకులపై ఫిర్యాదు చేశారు.

గత కొంతకాలంగా నులకపేట, ఎర్రక్వారీ, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి దౌర్జన్యాలకు  యువత పాల్పడుతున్నారు.