భయం భయం... పొద్దున లేచే సరికే ఇంటిముందు పుర్రె, ఎముకలు (వీడియో)

Black magic in Kurnool district (video)
Highlights

కర్నూలులో క్షుద్ర పూజల కలకలం

డోన్: కర్నూలు జిల్లా డోన్‌ రైల్వే క్వార్టర్స్ లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఒక ఇంటి గుమ్మం ముందు మానవ పుర్రె, ఎముకలు, బొమ్మలు పడి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగు రంగుల ముగ్గులు కూడా ఇంటిముందు వేశారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఇంటి ముందు పుర్రె, ఎముకలు కన్పించడంతో ఆ ఇంట్లో వ్యక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. గిట్టని వారు ఎవరో బెదిరించేందుకు ఇలా చేశారా? లేక నిజంగానే క్షుద్ర పూజలు జరిపారా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. వీడియో కింద ఉంది చూడండి.

"

loader