తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ దొంగ ఓట్లకు పాల్పడుతుందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు జనాల్ని గుంపులుగా బయటకు తీసుకొచ్చి..వేలమందితో  దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"

ఇలా దొంగ ఓట్లు వేసుకుంటే లక్షల ఓట్ల మెజారిటీతో  వైసిపి ఎందుకు గెలవదు అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి అరాచక శక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 

పోలీసులే ఎన్నికలు సక్రమముగా జరిగేలా చూడకపోతే  ఎలా? అంటూ ప్రశ్నించారు. 
అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ ఓట్లను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇది చూస్తూ కూడా పోలీసులు చూడనట్టు వ్యవహరిస్తున్నారని.. అధికార పార్టీ నేతలను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకోరని ప్రశ్నించారు. 

ఎన్నికల అధికారులందరు చేతిలెత్తేసారు, ఇతర సిబ్బంది అధికార పార్టీ కి తోత్తులుగా వ్వవహరిస్తున్నారని మండిపడ్డారు.