బిజెపిపై బాబు నిప్పులు


అమరావతి: కేంద్రంలోని బిజెపిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకొంటుందని విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపిపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బిజెపి కొత్త సంస్కృతికి తెరలేపిందని బాబు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆయన మద్దతు ప్రకటించారు.

గవర్నర్ కార్యాయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడం రాజ్యాంగ విరుద్దమని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, కేంద్రంలోని బిజెపి సర్కార్ తన రాజకీయ అవసరాల కోసం గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొంటుందని ఆయన ఆరోపించారు.

Scroll to load tweet…

శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఫోన్లో మాట్లాడి తన మద్దతును ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ వచ్చిన సమయంలో కేజ్రీవాల్‌తో ఈ విషయమై బాబు చర్చించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.