Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ వైసీపీ.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌ పేరుతో బీజేపీ భారీ క్యాంపెయినింగ్‌, ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల పాయింట్లలో సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పేరుతో సభలు నిర్వహించనుంది కమలదళం

bjp ready to conduct huge campaigning against ys jagan govt in ap
Author
First Published Sep 2, 2022, 3:27 PM IST

ఏపీ బీజేపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై భారీ క్యాంపెయినింగ్‌ ప్రోగ్రామ్ చేపట్టబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల పాయింట్లలో సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పేరుతో సభలు నిర్వహించనుంది కమలదళం. స్ట్రీట్ర కార్నర్ మీటింగ్స్‌కు రాష్ట్ర ఇన్‌ఛార్జీగా విష్ణువర్థన్ రెడ్డిని, ఉత్తరాంధ్ర జోన్ ఇన్‌ఛార్జీగా పరశురామ్ రాజు, కోస్తాంధ్ర జోన్ ఇన్‌ఛార్జీగా కోలా ఆనంద్, గోదావరి జోన్ ఇన్‌ఛార్జీగా తపన చౌదరి, రాయలసీమ జోన్ ఇన్‌ఛార్జీగా పనతల సురేశ్‌ను నియమించారు. 

ALso Read:డబ్బులన్నీ కేంద్రానివి.. బటన్ నొక్కేది జగన్, మూడేళ్లలో సాధించిందేంటీ : జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

అంతకుముందు గురువారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం ఇస్తున్న హర్డ్ వేర్, పెట్రో కాంప్లెక్స్ లను  ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కారిడార్లకు మౌళిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన  విమర్శించారు. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ కు  కేంద్రం అనుమతించిందన్నారు.  దీంతో రాష్ట్రాభివృద్దిపై బీజేపీ చిత్తశుద్దితో ఉందని  మరోసారి రుజువైందని సోము వీర్రాజు చెప్పారు. కేంద్రం కేటాయించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను వైసీపీ సర్కార్ తీసుకోవడం లేధని విమర్శించారు. రాష్ట్ర విభజన  సమయంలో ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios