తిరుపతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు టీటీడీపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన  ఆరోపణలపై రూ.200 కోట్లకు టీటీడీ పరువు నష్టం దావా వేయడాన్ని బీజేపీ నేత ఎస్.శ్రీనివాస్ తప్పుబడుతున్నారు.

టీటీడీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీటీడీపై  చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డిలపై ఒక్కొక్కరిపై వంద కోట్ల చొప్పున  పరువు నష్టం దావా వేశారు.

మంగళవారం నాడు  శ్రీనివాస్ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పరువు నష్టం దావా వేసేందుకు టీటీడీ రూ. 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రజల సొమ్మును వృధా చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల సొమ్మును పరువు నష్టం కేసు పేరుతో వృధా చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీకి చెందిన  బంగారు ఆభరణాలు మిస్సయ్యాయని  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  మరోవైపు  స్వామికి చెందిన ముఖ్యమైన హరం  కన్పించకుండా పోయిందని  కూడ టీటీడీ మాజీ అర్చకుడు ఆరోపించారు.

పోటులో కూడ తవ్వకాలు జరిపారని కూడ రమణదీక్షితులు  ఆరోపణలు చేశారు.  ఈ ఆరోపణల నేపథ్యంలోనే పరువు నష్టం దావా వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.