సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ తలపెట్టిన బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో.. సభకు అనుమతి లేదని పోలీసులు ఆయనకు వెల్లడించారు. ఈ క్రమంలో నోటీసులు తీసుకోకుండానే కన్నా గురజాలకు బయల్దేరారు. దీంతో మార్గమధ్యంలోనే కన్నాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను వెల్లడించేందుకు బీజేపీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.

ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఈ సభ జరగనుంది. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో గురజాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.