అమరావతి: ఏపీలో బీజేపీ నెంబర్‌వన్ అవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో  ఆదివారం నాడు ఆయన పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసలైన యుద్దాన్ని ప్రారంభించిందని  మురళీధర్ రావు చెప్పారు.  రానున్న రోజుల్లో గుంటూరు మిరపకాయలపై  చంద్రబాబునాయుడును కూర్చోబెడతామని ఆయన హెచ్చరించారు.

మోసం, ద్రోహం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని  మురళీధర్ రావు చెప్పారు. తాను ఇచ్చిన మాటపై కట్టుబడే నైజపం చంద్రబాబునాయుడుకు లేదన్నారు.  ఏనాడు కూడ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేదన్నారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏపీలో అమలు చేయలేదని  ఆయన బాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను  కేంద్రం 90 శాతానికిపైగా అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.