న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి. ఏపీలో పాలన ఏమీ జరగడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందంటూ మండిపడ్డారు. 

ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయడం కుదరదన్నారు. ప్రభుత్వాలు మారినా వర్క్ లను రద్దు చేయడం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్ అనేది అర్థరహితమంటూ కొట్టి పారేశారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై తాము సోమవారం నుంచి అధ్యయనం చేయనునున్నట్లు తెలిపారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనులు ఏమాత్రం జరగడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కరంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి ఒలాగే కొనసాగిస్తే పారిశ్రామిక వేత్తలు పారిపోతారని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.