Asianet News TeluguAsianet News Telugu

చెన్నైలో సుజనా చౌదరి.. ఈడీ కోర్టుకు హాజరు, 20 నిమిషాల్లోనే..

మాజీ ఎంపీ, బిజెపి నేత సుజనా చౌదరి చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. 

BJP MP Sujana Chowdary attended to Chennai Enforcement Directorate Court
Author
Hyderabad, First Published Aug 13, 2022, 8:31 AM IST

చెన్నై : బ్యాంకులను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ, బిజెపి నేత  sujana chowdary  శుక్రవారం చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు హాజరయ్యారు. 20 నిమిషాల విచారణ తర్వాత ఆయన నుంచి వెళ్ళిపోయారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్,  కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రుణాలు పొందేందుకు సుజనాచౌదరి అడ్డదారులు తొక్కినట్లు వచ్చిన ఆరోపణలతో గతంలో ఈడి రంగంలోకి దిగింది. 

ఈ నేపథ్యంలో కోర్టు సమన్ల మేరకు శుక్రవారం 11 గంటల సమయంలో మళ్లీ అదే కోర్టు విచారణకు సుజనాచౌదరి హాజరయ్యారు తన న్యాయవాదులు ముఖ్య సన్నిహితులతో కలిసి కోర్టులోకి వెళ్లారు. 20 నిమిషాలపాటు కోర్టు న్యాయాధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగమేఘాలమీద బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు ఈ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ఆయనను ఫోటోలు, వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాగా ఆయన తన చేతులను అడ్డుపెట్టుకున్నారు. ఆయనను ప్రశ్నించే ప్రయత్నం చేయగా మౌనంగా వెళ్ళిపోయారు. 

ఆ తప్పు మళ్లీ చేయకండి..నన్ను ‘రెడ్డి’గా మార్చకండి.. పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి అమర్ నాథ్...

ఇదిలా ఉండగా, మార్చి 5న రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ,  కోర్టు అధికారాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండి పడ్డారు. మూడు రాజధానులు అంశ పై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సుజనాచౌదరి స్పందించారు. అమరావతిని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా?  అని ప్రశ్నించారు. రాజధాని పై అసెంబ్లీ లో ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. సంఖ్యాబలం ఉందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవం కావు.  రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తాం అంటే కుదరదు. పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం,  దీనికి ఆనాడు విపక్షంలో ఉన్న వైసీపీ మద్దతు ఇవ్వడం జరిగింది. 

ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపాలి. విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం న్యాయపరంగా చెల్లదు. సిఆర్డిఏకి  భూములిచ్చిన రైతులకు మధ్య  చట్టబద్ధమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సీఆర్డీఏని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ రెండు అంశాలను హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేగాని.. శాసనసభకు, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదు. కోర్టులపై దుష్ప్రచారం చేస్తూ కోర్టుల విశ్వసనీయతను దెబ్బతీయడమే లక్ష్యంగా శాసనసభ వేదికగా చేసుకుని జగన్, ఆయన వందిమాగాధులు అసత్య ప్రచారం చేశారు. 

న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించి,  కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం తీవ్ర ఆందోళనకరమైన అంశం.  వ్యవస్థల విధ్వంసం కోసం  ఎంతకైనా తెగిస్తారని  సభ సాక్షిగా  మరోసారి నిరూపించారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలకు తెర తీస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులు బిల్లు తెస్తే న్యాయసమీక్షకు నిలవదు.  ఏపీకి కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ.. అని..  ఏపీ సమగ్రాభివృద్ధికి, ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధికి  బిజెపి కట్టుబడి ఉంది’ అని సుజనాచౌదరి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios