వెంకటేశ్వరస్వామిపై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానని ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చెప్పారు.


తిరుపతి: వెంకటేశ్వరస్వామిపై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానని ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయంలో ఎక్కువగా అవినీతి చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగ్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

బుధవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ మీడియా సంస్థపై కూడ కేసు వేస్తానని ఆయన చెప్పారు.

తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చేశానని ఆయన గుర్తు చేశారు. టీటీడీపై కూడ ప్రభుత్వ పెత్తనం లేకుండా చేస్తానని ఆయన తెలిపారు. తిరుమలను కూడ ప్రభుత్వ ఆధిపత్యం నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడ కేసు వేస్తున్నట్టుగా ఆయన వివరించారు.