విజయ్ మాల్యాలాగా సుజనా చౌదరి కూడా దేశం వదిలి వెళ్లిపోతారని ఆరోపించారు.  సీఎం రమేష్.. వందల కోట్ల పన్నులు ఎగ్గొట్టారని మండిపడ్డారు.

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై బీజేపీ నేత జీవీఎల్ సంచలన కామెంట్స్ చేశారు. రూ.5,700కోట్లు మోసానికి పాల్పడి.. సుజనా చౌదరి ఆంధ్రా మాల్యాగా మారారని జీవీఎల్ విమర్శించారు.

గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విజయ్ మాల్యాని దేశం దాటించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. విజయ్ మాల్యాలాగా సుజనా చౌదరి కూడా దేశం వదిలి వెళ్లిపోతారని ఆరోపించారు. సీఎం రమేష్.. వందల కోట్ల పన్నులు ఎగ్గొట్టారని మండిపడ్డారు.

సీఎం రమేష్, సుజనా లాంటి అక్రమార్కులను వెంట పెట్టుకొని తిరిగుతుంటే.. చంద్రబాబుపై కూడా అనుమానాలు వస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు అర్రులు చాచారని ఆరోపించారు. సీట్ల పంపకంలో తేడా వచ్చి టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు కలవలేకపోయారని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ అంటూ చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు. అక్రమార్కులకు చంద్రబాబు మద్దతుగా మాట్లడటం సిగ్గుచేటన్నారు. ఆలీబాబా నలభై దొంగలు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ సంపాదన దాచుకోవడం కోసమే చంద్రబాబు రాహుల్‌ పంచన చేరారని ఆరోపించారు.