అమరావతి బాండ్లపై జీవిఎల్ సంచలన ఆరోపణలు

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 27, Aug 2018, 3:19 PM IST
BJP MP GVL ON AMARAVATHI BONDS
Highlights

తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అప్పుల్లో కూడా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి పార్టీ ఫండ్ గా మార్చేస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు.

విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అప్పుల్లో కూడా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి పార్టీ ఫండ్ గా మార్చేస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు. మరోవైపు విద్యావ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న జీవీఎల్ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇచ్చినా అమలు చెయ్యడం లేదని దుయ్యబుట్టారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. విద్యను ప్రైవేటీ కరణ చేసేశారన్నారు. విద్యారంగంలో పెద్ద స్థాయిలో అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. అమరావతి బాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 10.32శాతం వడ్డికీ తెచ్చారన్నారు. బాండ్ల వ్యవహారంలో కూడా అవినీతికి ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం కోసం 60వేల కోట్లు అప్పుచెయ్యాలని ప్రభుత్వ ప్రణాళిక అని...అది రాష్ట్రాన్ని మరింత అప్పుల్లో నింపేసేలా ఉందని మండిపడ్డారు.

loader