టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అక్రమాల కేసులకు సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డు లెవల్లో స్టే ఎందుకు కొనసాగుతోందని ఆయన ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయమూర్తులకు చంద్రబాబు సహకారం అవసరం లేదన్నారు.

Also Read:ఫోన్ ట్యాపింగ్ వైసీపీకి కొత్త కాదు: డీజీపీ లేఖపై బాబు స్పందన ఇదీ

కోర్టులకు ఈ విషయంలో సంపూర్ణ అధికారాలు ఉన్నాయని.. ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ అంశమని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖలో ఎవరి ఫోన్ ట్యాప్ అయ్యిందో చంద్రబాబు రాయలేదన్నారు.

అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండవన్న ఆయన .. కొన్ని అంశాల్లోనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని నరసింహారావు స్పష్టం చేశారు. కోర్టులపై నిఘా వుంచారని బాబు అంటున్నారని.. అలాంటివి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలకు తెలుసునన్నారు.