కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులను చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులను చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బాబు ఎంత తాపత్రయపడినా ఈ పనులన్నీ కేంద్రప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ప్రజలకు తెలుసునని జీవీఎల్ చెప్పారు.

చంద్రబాబు బయోపిక్‌ను చూడటానికి జనం ఇష్టపడటం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపైనా సినిమాలు వచ్చాయని.. కానీ తామేవరికి సినిమాలు తీయమని చెప్పకుండానే వారు బీజేపీ ఘనతను గుర్తించారని తెలిపారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ ఇతివృత్తంగా ‘‘యూరీ’’ సినిమా సూపర్‌హిట్ అయిందన్నారు. ‘‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ’’ను స్వచ్ఛభారత్ పథకానికి స్పూర్తిగా నిర్మించారని నరసింహారావు తెలిపారు.

చివరికి టాయ్‌లెట్ ‌పథకానికి కూడా టీడీపీ స్టిక్కర్ వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్టీఆర్ ముఖం చూడటానికే జనం సినిమా థియేటర్‌కు వెళ్లేవారని, కానీ ఆయన జీవితంపై వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ముఖ్యమంత్రేనని ఎద్దేవా చేశారు.