Asianet News TeluguAsianet News Telugu

బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు: స్వాగతించిన బీజేపీ ఎంపీ జీవీఎల్

ఉమ్మడి ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి  బోర్డుల పరిధిలోకి తీసుకు రావడాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగానే పనిచేస్తోందన్నారు. 
 

BJP MP GVL Narasimha rao welcomed ganette notification on irrigation projects lns
Author
Visakhapatnam, First Published Jul 16, 2021, 11:13 AM IST


విశాఖపట్టణం:  ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకురావడం శుభపరిణామమని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. శుక్రవారంనాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఈ గెజిట్ నోటిపికేషన్  వల్ల రాష్ట్రాల మధ్య సయోధ్య నెలకొనే అవకాశం ఉందని ఆయన  అబిప్రాయపడ్డారు.  ఏపీ ప్రభుత్వం ఈడబ్ల్యుసీ రిజర్వేషన్లు తీసుకురావడాన్ని ఆయన స్వాగతించారు.

ఏపీ సర్కార్  అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గత ప్రభుత్వం వ్యవహరించిన చందంగానే ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.రెండు రాష్ట్రాల మధ్య జల జగడానికి చెక్ పెట్టేందుకు వీలుగా  ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చింది.  కేంద్రం తీసుకొచ్చిన  గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios