రాజమండ్రి:  పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు సొమ్మువారంగా మార్చుకొన్నాడని బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రతి సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జీవీఎల్  వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

మంగళవారం నాడు ఆయన  రాజమండ్రిలో  మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు ఆలస్యమైందని రూ.1312 కోట్లు అదనంగా కేంద్రం చెల్లించిందని ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడు తన బినామీ ఎంపీలకు రూ. 5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

సీఎం స్వంత జిల్లాలోనే ప్రజలకు తాగునీటిని అందించలేని దుస్థితి ఉందన్నారు. ధన, కుల రాజకీయాల నుండి విముక్తి కావాలంటే బీజేపీ అధికారంలోకి  రావాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ కూడ కుల రాజకీయాలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడ దక్కదన్నారు. పట్టిసీమలో రూ. 321 కోట్లను ప్రభుత్వం గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టారని ఆయన  ఆరోపించారు.