న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల సూచించినట్టుగా నడుచుకోవాలని ఆయన ఆయన సూచించారు

గురువారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నియమావళిని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.

ఏపీలో పోటింగ్ ముగిసిన తర్వాత కూడ చంద్రబాబునాయుడు హడావుడి ఇంకా తగ్గలేదన్నారు. ఈసీ మార్గదర్శకాలను ఆయన తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలివైన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించరని తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. గత ఏడాది నవంబర్ మాసంలో  అతను  నిర్వహించే కొన్ని సంస్థలపై దాడులు జరిగిన విషయం తనకు మీడియా ద్వారా తెలిసిందని జీవీఎల్ చెప్పారు.