విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతిని ల్యాండ్ మాఫియాగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జీవీఎల్ అమరావతి భూములను టీడీపీలోని ల్యాండ్‌ మాఫియా కారు చౌకగా కొట్టేసిందన్నారు. టీడీపీ ఎంపీలే టెండర్లు వేసి వారే కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు.
 
వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆలోచనలో టీడీపీ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.1.50లక్షల కోట్లు అప్పులు తెచ్చారని వాటికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌లో లక్షల మంది దాచుకున్న డబ్బు దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. 

ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన పరిస్థితే త్వరలో ఏపీలో టీడీపీకి రానుందన్నారు. 6 నెలల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉండదని చెప్పారు. టీడీపీ అవినీతిపై విచారణ జరిపిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో కొత్త ప్రభుత్వం, బీజేపీదీ కీలకపాత్ర: రామ్ మాధవ్

కారు చౌకగా అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసే యత్నం: కన్నా

అగ్రిగోల్డ్ బాధితులను టీడీపీయే అదుకుంటుంది:మంత్రి కాల్వ​​​​​​​