విశాఖపట్టణం: చంద్రబాబునాయుడును ఎవరూ కూడ  ప్రధాని అభ్యర్ధగా ఎవరు
నిర్ణయించలేదని  బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.


శుక్రవారం నాడు ఆయన విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తన  కొడుకు
లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి  
కావాలనిఅనుకొంటున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

2014 ఎన్నికల్లో జనసేన, బిజెపి కారణంగానే  ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి
వచ్చందని సోము వీర్రాజు  చెప్పారు. కానీ, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపి అభ్యర్ధుల
గెలుపు కోసం  టిడిపి ఏనాడూ కూడ సహకరించలేదని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు లాంటి కుట్రపూరిత మనస్తతత్వం ఉన్నవారెవరు కూడ  దేశంలో
లేరని  సోమువీర్రాజు విమర్శించారు.రాష్ట్రంలో బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకొంటుంటే
తట్టుకోలేకే టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీ రాష్ట్రంలో పాలన స్థంబించిందని ఎమ్మెల్సీ వీర్రాజు చెప్పారు.
నవ నిర్మాణ దీక్షల పేరుతో ఉద్యోగులు  కార్యాలయాల్లో ఉండడం లేదన్నారు. చంద్రబాబు
అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 

చంద్రబాబుకు, లోకేష్‌లకు ఓటమి భయం పట్టుకొందన్నారు. అవినీతి ఆరోపణలున్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు ఎందుకు అనుకొంటున్నారో చెప్పాలని  బాబును ప్రశ్నించారు బాబు. ప్రతిరోజూ మోడీ నామస్మరణ చేస్తూ బిజెపికి చంద్రబాబునాయుడు గౌరవ కార్యదర్శిగా మారారని ఆయన ఎద్దేవా చేశారు.