అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఈ ప్రభుత్వం కూడా తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. లేని హోదాను ఇవ్వమంటే ఎలా ఇస్తామంటూ నిలదీశారు. 

కేంద్రప్రభుత్వం హోదా అనేది ఇస్తే ముందుకు ఏపీకే ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై తాము కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అది కూడా ఇచ్చే అవకాశం ఉంటేమాత్రమేనని కుండబద్దలు కొట్టారు. 

ఇకపోతే అసెంబ్లీలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై ఇచ్చిన తీర్మానంపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.