చంద్రబాబునాయుడు గ్రాఫ్ పడిపోతోందని. టిడిపితో ఇంకా పొత్తు కొనసాగిస్తే భాజపాకు ఇబ్బందేనని. ఇప్పటికిప్పుడు పొత్తును విచ్ఛినం చేసుకోవాలని స్పష్టంగా చెప్పారు. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు పాలనలో వ్యవస్ధలు ఏ విధంగా అవినీతిమయమైపోయాయో వివరించారు.

భారతీయ జనతా పార్టీలోని రెండు వర్గాలు మోహరించాయి. ఇంతకాలం ఢిల్లీకి వెళుతూ తమ రాజకీయాన్ని నడుపుతున్న రెండు గ్రూపులు తాజాగా విజయవాడలోనే మోహరించాయి. భాజపాలో ఎప్పటి నుండో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక గ్రూపులు ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలను అందిస్తూనే ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ వచ్చిన సందర్భంగా చంద్రబాబు వ్యతిరేక గ్రూపు అమిత్ తో సమవేశమైంది.

చంద్రబాబునాయుడు గ్రాఫ్ పడిపోతోందా? ఈ మాటలు చెప్పింది ప్రతిపక్ష వైసీపీ కాదు సుమా. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ నేతలే చెబుతున్నారు. పలువురు నేతలతో ముఖాముఖి అమిత్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోమువీర్రాజు, కావూరిసాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు.

వీరంతా చెప్పింది దాదాపు ఒకటే. చంద్రబాబునాయుడు గ్రాఫ్ పడిపోతోందని. టిడిపితో ఇంకా పొత్తు కొనసాగిస్తే భాజపాకు ఇబ్బందేనని. ఇప్పటికిప్పుడు పొత్తును విచ్ఛినం చేసుకోవాలని స్పష్టంగా చెప్పారు. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు పాలనలో వ్యవస్ధలు ఏ విధంగా అవినీతిమయమైపోయాయో వివరించారు. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు, పోలవరం, పట్టిసీమ, రాజధాని, ఇసుక తవ్వకాల్లో చంద్రబాబు, టిడిపి నేతల అవినీతి భాగోతాలను భాజపా నేతలు అమిత్ షా కు వివరించారు.

అదే విషయాన్ని కావూరి మాట్లాడుతూ చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని చెప్పామన్నారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయమైయిందని, టిడిపితో పొత్తు కొనసాగితే భాజపాకు ఏ విధంగా నష్టమో కూడా వివరించారట. జన్మభూమి కమిటీలు వేసి సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులను ఎంపిక చేస్తున్న విధానాన్ని వివరించినట్లు తెలిపారు. భాజపా నేతలను, కార్యకర్తలను టిడిపి చిన్న చూపుచూస్తోందని వారందరూ ఫిర్యాదు చేసారు. ఒకరకంగా వారంతా చంద్రబాబుపై వ్యతిరేకంగానే చెప్పారు.