Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు... మేం వ్యతిరేకం: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి

 సంస్కరణలు అమలు చెయ్యమని చెప్పాము కానీ ప్రజలపై భారాలు వెయ్యమని కేంద్రం రాష్ట్రాలకు చెప్పలేదని బిజెపి నాయకులు విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. 

bjp  leader vishnuvardhan reddy serious on cm jagan decissions akp
Author
Amaravati, First Published Jun 15, 2021, 1:40 PM IST

అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం పన్నుల వడ్డన మొదలుపెట్టుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమం పేరుతో ఇస్తున్నారు... పన్నుల పేరుతో వసూలు చేస్తున్నారని అన్నారు. చెత్త ప్రభుత్వాలకు చెత్త మీద పన్నులు వేసి వసూలు చేసుకోవాలనే ఆలోచన వస్తుందని... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  కూడా చెత్తపై పన్ను వెయ్యలేదన్నారు. మునిసిపల్, కార్పొరేషన్లలో పన్నుల పెంపుకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  

''వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే చర్యలకు బీజేపీ వ్యతిరేకం. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది. సంస్కరణలు అమలు చెయ్యమని చెప్పాము కానీ ప్రజలపై భారాలు వెయ్యమని చెప్పలేదు'' అని స్పష్టం చేశారు. 

''తెలుగు మీడియం అమలు విషయంలో ప్రభుత్వం పంధాకు పోతుంది. తెలుగు మీడియం అమలులో హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి పట్టడం లేదు. డిగ్రీ కళాశాలల్లో నిర్బంధ ఇంగ్లీషు మీడియం అమలును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ గడప దాటడం లేదు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కళాశాలు పెడతామని చెప్పి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటి ఏర్పాటు చేయలేదు. వైస్సార్ తెలుగు మహా సభలు పెడితే తనయుడు మాత్రం తెలుగు మీడియం రద్దు చేస్తున్నాడు" అని ఎద్దేవా చేశారు. 

read more  మేం అధికారంలోకి రాగానే... విజయసాయి, అవంతిలకు ఒకటికి ఒకటిన్నర తిరిగిస్తాం: బుద్దా వార్నింగ్

''తెలుగు మీడియం రద్దు చేసి జగనన్న విద్యా కానుక పేరుతో  తెలుగు డిక్షనరిలు పంపిణి చేస్తారా. బుర్ర లేని సంస్కరణలు విద్యారంగంలో అమలు చేస్తున్నారు. రుణ ప్రణాళికల పేరుతో రైతులను మోసం చెయ్యాలని చూస్తున్నారు. రైతులను అడ్డం పెట్టుకొని జగనన్న కాలనిలకు నిధులు సమకూర్చుకోవడానికి ఎస్ఎల్బిసి సమావేశం ఏర్పాటు చేస్తారా. రాష్ట్రంలో 80శాతం బ్యాంకులు రైతులు వ్యవసాయం కోసం చేసిన అప్పులు రెన్యూవల్ చెయ్యడం లేదు. ప్రభుత్వం, బ్యాంకులు కలిసి రైతులను మోసం చేయాలని చూస్తున్నాయి'' అన్నారు. 

''హిందూ ధార్మిక సంస్థల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు పదే పదే జోక్యం చేసుకుంటుంది. చరిత్ర కలిగిన కుటుంబ వ్యవస్థల విషయంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది. హిందూ ట్రస్ట్ ల విషయంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ క్రిస్టియన్ ట్రస్టుల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. హిందూ ధార్మిక సంస్థల ఆస్తులను ఖజానాకు మళ్లించడానికి ఉన్న శ్రద్ధ మిగిలిన మతాల విషయంలో ప్రభుత్వానికి ఎందుకు లేదు. మతాల పేరుతో ప్రజల్లో లేని అసమానతలను ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది'' అని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios