Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ, బీజేపీ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.. : విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో అసమ్మతి చిచ్చు రేపుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాకుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP Leader Vishnu Kumar raju Response on his party Performance in MLC Elections
Author
First Published Mar 18, 2023, 3:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో అసమ్మతి చిచ్చు రేపుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, పార్టీ సాధించిన ఓట్లపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాకుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీలు ఒక్కటే అన్న అభిప్రాయం చాలా మంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. వైసీపీ, బీజేపీల మధ్య సంబంధం లేదని తాము చెప్పినప్పటికీ ఎందుకో ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. 

వైసీపీతో బీజేపీ ఉందనే అభిప్రాయం కొనసాగితే పార్టీకి మరింత నష్టం  కలుగుతుందని  అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.  బీజేపీ సాధించిన ఫలితాలపై తాము అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు డబ్బులు పంచలేదని.. వైసీపీ వాళ్లు మాత్రం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన ఓట్లు పడలేదని అంటున్నారని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావడం సంతోషమని అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విష్ణుకుమార్ రాజు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యం అని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పోరాట స్పూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతర్మథనం చేసుకోవాలి

Follow Us:
Download App:
  • android
  • ios