విజయవాడ: రెండేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ   సునీల్  దియోధర్ జోస్యం చెప్పారు.  ః

మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఆయన మంగళవారం నాడు పామర్రులో పర్యటించారు. ఏపీ అభివృద్ది కోసం నిధులు కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందన్నారు.

ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబును ఉపేక్షించడం తగదన్నారు. తన రాజకీయ వారసుడిగా చంద్రబాబునాయుడు లోకేష్‌ను ప్రకటించడం శోచనీయమన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ఇచ్చిన హమీని ఆయన నెరవేర్చుకోవాలని  ఆయన కోరారు.