తెలుగు రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.  అసంతృప్తి నేతలు, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా... టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నకు బీజేపీ గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమనిపించేలా తాజాగా సోము వీర్రాజు బుద్ధాని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామంటూ సోము వీర్రాజు.. బుద్ధా వెంకన్నతో అనడం విశేషం. శాసన మండలి వెలుపల ఈ ఇద్దరు నేతలు ఎదరుపడగా... వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు... బుద్ధాని బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అప్పుడు మంత్రి పదవి కేటాయిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

సోము ఇచ్చిన ఆఫర్ తీసుకోకపోగా.. బుద్ధా కౌంటర్ ఇచ్చారు. ‘‘ మీరే మాతో కలిసి పోటీ చేయండి. అధికారంలోకి వచ్చాక కేబినేట్ తీసుకుంటాం’ అంటూ బుద్ధా వెంకన్న సోమువీర్రాజుకి సూచించారు.