Asianet News TeluguAsianet News Telugu

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ అలా రాకపోతే అన్యమతవాదిగా భావించాల్సి వస్తుంది.. బీజేపీ నేత రమేష్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మపత్నితో కలసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆచారాన్ని పాటించాలని సీఎం జగన్‌ను కోరారు.

Bjp Leader Ramesh Naidu Over CM Jagan Tirumala Visit
Author
First Published Sep 27, 2022, 5:29 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల కోసం సీఎం జగన్.. ఇప్పుడైనా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా రావాలని భక్తులు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మపత్నితో కలసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆచారాన్ని పాటించాలని సీఎం జగన్‌ను కోరారు. సీఎం జగన్ అలా రాకపోతే అన్యమతవాది భావించవలసి వస్తుందని అన్నారు. 

ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి పట్ల విశ్వాసం ఉన్నట్టుగా సంతకం తీసుకోనే విదంగా పుస్తకాన్ని ఆలయ అధికారులు ముఖ్యమంత్రి ముందు పెట్టాలని లేదా సీఎం జగన్ స్వయంగా సంతకం పేట్టి ఆదర్శంగా నిలవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని రమేష్ నాయుడు ట్వీట్ చేశారు. ఓంటరిగా సీఎం జగన్ మఠాలకి వెళ్ళి, పుణ్య నదులలో మునిగినా, ఆలయాల సందర్శన చేసినా అది కేవలం హిందూ ఓట్ల కోసం హిందువులను భ్రమింప చేయడానికే అనే భావన తోలగించాలని రమేష్ నాయుడు అన్నారు.

 


వైఎస్సార్ చేయూత కార్యక్రమం కోసం పరమ శివుని విగ్రహానికి తాళ్లు కట్టడం ఆవేదనకు గురిచేసిందని అన్నారు. ఇది  హిందూ దేవుని పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న అలసత్వం తేలియజేస్తుందన్నారు. ఈ ఘటనపై హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios