కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రాంమాధవ్  అన్నారు. మంగళశారం కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలౌన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలో   బీజేపీ నేత రాం మాధవ్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు.  కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా కూడా హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ పేర్కొన్నారు. దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.