వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో కేంద్రం జోక్యం చేసుకోదు: పురంధేశ్వరి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి    కేసు విషయమై  మాజీ కేంద్ర మంత్రి  పురంధేశ్వరి స్పందించారు.  ఈ కేసులో  కేంద్రం జోక్యం  చేసుకోదని  ఆమె  తేల్చి  చెప్పారు. 
 

BJP Leader Purandeswari  Responds  on  Kadapa MP  YS Avinash Reddy Case lns

విశాఖపట్టణం: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  కేసు విసయంలో   కేంద్రం జోక్యం  చేసుకోదని  మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత  పురంధేశ్వరి  స్పష్టం  చేశారు.బుధవారంనాడు  విశాఖపట్టణంలో  ఆమె   మీడియాతో మాట్లాడారు.  సీబీఐ   స్వతంత్ర దర్యాప్తు సంస్థగా  ఆమె  గుర్తు  చేశారు.  వైసీపీ ఆగడాలు  ఇకపై  ఏపీలో సాగవని ఆమె చెప్పారు. వైసీపీ దాష్టీకాలను  చార్జీషీట్ల ద్వారా  ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టుగా  ఆమె  తెలిపారు. ఏపీలో  జనసేనతో  పొత్తు కొనసాగుతుందని  పురంధేశ్వరి  చెప్పారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  ఈ నెలలో  మూడు దఫాలు  సీబీఐ నోటీసులు  జారీ చేసింది.  ఈ నెల  16, 18, 22న విచారణకు  రావాలని  వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ  నోటీసులు జారీ చేసింది.  కానీ  పలు కారణాలను చూపుతూ  వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు  హాజరు కాలేదు.

also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సుప్రీం ఆదేశం

మరో వైపు  ముందస్తు బెయిల్ పై  వెంటనే ఆదేశాలు ఇవ్వాలని  కోరుతూ  సుప్రీంకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.
 ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్  నిన్న  విచారణ  నిర్వహించింది.  ఈ నెల  25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ  నిర్వహించి ఆదేశాలు  ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు  జారీ చేసింది. దీంతో  రేపు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  తీర్పును ఇవ్వనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios