ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో కింది నుంచి పైస్థాయి వరకు అవినీతి పెరిగిపోయిందని, త్వరలో చంద్రబాబుపై చార్జిషీట్ తీసుకుని వస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి బాగా పెచ్చరిల్లిందని ఆరోపించారు. దీనిపై తాము వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకుని వస్తామని చెప్పారు.
ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ తమ పార్టీ అమలు చేస్తుందని, అవన్నీ పూర్తిచేశాకే 2019 ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజల ముందుకు వెళుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని అటువంటి పార్టీతో టీడీపీ జత కడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మీడియా సమావేశంలో విశాఖ ఎంపీ హరిబాబు, శాసనసభ పక్షనేత పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జాతీయ కార్యదర్శి విశ్వనాథరాజు పాల్గొన్నారు.
