కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు నీటి ప్రాజెక్టుల మీద లేదన్నారు. లోకేష్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ తీసుకువచ్చేది కేవలం జీబేపీ నే అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్టాడిన ఆయన మరోసారి చంద్రబాబుపై మండిపడ్డారు.
దొంగ దీక్షలు చేసి చైనాకు చెందిన ఒక స్క్రాప్ కంపెనీతో ఉక్కు ఒప్పందం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు నీటి ప్రాజెక్టుల మీద లేదన్నారు. లోకేష్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోంది చంద్రబాబే అని, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో జతకట్టారని కన్నా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
