తిరుపతి: బిజెపికి కలిసొచ్చిన పవన్ కల్యాణ్ మద్దతు... టీడీపీ, వైసీపీలకు తగ్గిన ఓట్లు
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఈ దఫా తక్కువ ఓట్లను సాధించింది. టీడీపీ కూడ గతంలో కంటే తక్కువ ఓట్లను దక్కించుకొంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను పెంచుకొంది.
తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఈ దఫా తక్కువ ఓట్లను సాధించింది. టీడీపీ కూడ గతంలో కంటే తక్కువ ఓట్లను దక్కించుకొంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను పెంచుకొంది.
తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించారు. డాక్టర్ గురుమూర్తిని వైసీపీ అభ్యర్ధిగా వైసీపీ నిలిపింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేశారు. గత ఎన్నికల సమయంలో జనసేన, లెఫ్ట్ , బీఎస్పీల మధ్య పొత్తు ఉంది. కానీ ఈ ఎన్నికల సమయంనాటికి లెఫ్ట్ పార్టీలతో పొత్తును తెగదెంపులు చేసుకొన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టారు.
also read:తిరుపతి ఉప ఎన్నిక.. భారీ ఆధిక్యంలో వైసీపీ
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి 5,37,152 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3,05,209, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు 50,739 ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ కి 7,22,877 ఓట్లు, టీడీపీకి 4,94, 501, బీజేపీకి 16,125 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్ధి పోటీ చేశారు. బీఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతును ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీకి 20.971 ఓట్లు దక్కాయి.
అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ దఫా మాత్రం బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. గత ఎన్నికల్లో నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రత్యర్ధులు ఆ పార్టీపై విమర్శలు గుప్పించేవారు.
తిరుపతి ఎంపీ స్థానం నుండి 2.31 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ స్థానంలో టీడీపీకి మంచి మెజారిటీ వచ్చింది. కానీ ఈ దఫా మాత్రం తిరుపతిలో వైసీపీ పుంజుకొంది. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కొంత గతంలో కంటే పుంజుకొన్నట్టుగా కన్పించింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం టీడీపీ రాబిన్ శర్మ పనిచేశారు. గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీ, వైసీపీల్లో చేరారు. మరికొందరు నేతలు స్థబ్ధుగా ఉన్నారు.