రేపటి నుండి ఏపీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా టూర్:కాషాయ నేతలకు దిశా నిర్ధేశం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 6, 7 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు జేపీనడ్డా దిశా నిర్ధేశం చేయనున్నారు.
అమరావతి:BJP జాతీయ అధ్యక్షుడు JP Nadda ఈ నెల 6,7 తేదీల్లో Andhra pradesh రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు విజయవాడకు జేపీ నడ్డా చేరుకుంటారు. ఎల్లుండి రాజమండ్రిలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు.
ఈ నెల 6న ఉదయం Vijayawadaకు చేరుకుంటారు. విజయవాడలో రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్‌లతో సమావేశమవుతారు. సాయంత్రం నగరంలో జరిగే మేధావుల సమావేశంలో పాల్గొంటారు. జూన్ 7న రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
అదే రోజు వివిధ రంగాల ప్రముఖులతో సమవేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయమై Jana sena చీఫ్ Pawan Kalyan రెండు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ తరుణంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఏపీ పర్యటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్రీకరించింది. వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో Telangana రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని Narendra Modi ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
జేపీ నడ్డా టూర్ కి సంబంధించి ఆ:ద్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది.ఇవాళ జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ నేతలకు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ దిశా నిర్ధేశం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవల కాలంలో ధీమాగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. అయితే జనసేన చీఫ్ ఇటీవల కాలంలో పొత్తులపై కీలక ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ెన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరక ఓటు చీలకుండా ఉండేందుకు గాను విపక్షాలను ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రకటనపై అధికార వైసీపీ తీవ్రంగా విరుచుకుపడింది.
also read:ఎన్నికల్లో నాయకుల కుటుంబాలకు కాదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనలు చేస్తున్నారా అని ప్రశ్నించింది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ ముందున్న మూడు ఆఫ్షన్ల విషయాన్ని కూనడా పవన్ కళ్యాణ్ పార్టీ నేతల ముందుంచారు. బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయం రెండో ఆర్షణ్ గా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక చివరగా జనసేన ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేయడమని చెప్పారు. జనసేనతో తమ పార్టీ అనుబంధం కొనసాగుతుందని బీజేపీ జాతీయ నేత పురంధేశ్వరీ ప్రకటించారు. మరో వైపు పొత్తులపై టీడీపీ చంద్రబాబుదే తుది నిర్ణయమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చితమనేని ప్రభాకర్ ప్రకటించారు.