యోగ్యతా లేనివారు హోదాపై మాట్లాడుతున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

తిరుపతి: యోగ్యతా లేనివారు హోదాపై మాట్లాడుతున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కంటే సాగునీటి ప్రాజెక్టులు,సీమ అవసరాలు ముఖ్యం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబు రూ. 7200 కోట్లు ఖర్చు పెట్టి కూడా రాజధాని కట్టలేదని ఆయన చెప్పారు. జగన్ వచ్చి రెండేళ్లు దాటినా రాజధానిపై స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ నేత వెంకన్నబాబు నామం పెట్టుకొంటే మంత్రులకు వేళాకోలం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. నాడు అమిత్ షా వస్తే చంద్రబాబునాయుడు రాళ్లు వేయించారన్నారు. కేంద్ర సంస్థలను రానివ్వమని నాడు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర బలగాలు కావాలని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.