విజయవాడ:బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి
కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం నాడు విజయవాడలోని
పార్టీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. 

ఇటీవలనే కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా
పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది.  ఈ సందర్భంగా కన్నా
లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం
ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. అలాగే
బీజేపీపై టీడీపీ తప్పుడు  ప్రచారం చేస్తోందని కన్నా
లక్ష్మీనారాయణ మండిపడ్డారు.ఈ ప్రచారాన్ని తిప్పి
కొడతామని ఆయన చెప్పారు.

 కాంగ్రెస్ తో టీడీపీ లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకొందని
ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ మెప్పుకోసం బీజేపీని
విమర్శిస్తున్నారని కన్నా పేర్కొన్నారు. అలాగే అగ్రిగోల్డ్‌
బాధితులకు అండగా నిలబడతామని ఆయన అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నయవంచన దీక్షలు
చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.