Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అభివృద్దిపై కేంద్రానికి చిత్తశుద్ది: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

ఏపీకి కేంద్రం ఇస్తున్న హర్డ్ వేర్ ,పెట్రో కాంప్లెక్స్ లను ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం చిత్తశుద్దితో ఉందని వీర్రాజు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సక్రమంగా కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోవడం లేదన్నారు.

BJP AP Chief Somu Veerraju Comments On YCP
Author
First Published Sep 1, 2022, 12:03 PM IST

అమరావతి:  ఏపీకి కేంద్రం ఇస్తున్న హర్డ్ వేర్, పెట్రో కాంప్లెక్స్ లను  ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కారిడార్లకు మౌళిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన  విమర్శించారు.

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ కు  కేంద్రం  అనుమతించిందన్నారు.  దీంతో రాష్ట్రాభివృద్దిపై బీజేపీ చిత్తశుద్దితో ఉందని  మరోసారి రుజువైందని సోము వీర్రాజు చెప్పారు. కేంద్రం కేటాయించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను వైసీపీ సర్కార్ తీసుకోవడం లేధని విమర్శించారు. రాష్ట్ర విభజన  సమయంలో ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆయన చెప్పారు. 

గత మాసంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీని కళిశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని కోరారు.  ఈ సమావేశం తర్వాత ఏపీ రాష్ట్రానికి చెందిన విభజన సమస్యలు పరిష్కరించేందుకు గాను కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.విభజన సమస్యలపై ఈ కమిటీ  చర్చిస్తుంది.  ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.3 వేల కోట్లు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios