అంటే వచ్చిన ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా భాజపా కోటాలో కాకుండా నాయుడుగారి కోటాలో వచ్చిందట. దాంతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారట. ఎందుకైనా మంచిదని మిత్రపక్షానికీ ఓ కార్పొరేషన్ పడేసారు.

మొత్తానికి బారతీయ జనతా పార్టీ ఒక కార్పొరేషన్ సాధించుకుంది. రాష్ట్రప్రభుత్వం తాజాగా నియమించిన ఐదు కార్పొరేషన్ ఛైర్మన్లలో ఒకటి భాజపాకు దక్కటం విశేషమే. ఎందుకంటే, అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్నా ఇంతవరకూ భాజపాకు ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ కూడా చంద్రబాబునాయుడు ఇవ్వలేదు. పోయిన ఎన్నికల్లో టిడిపి-భాజపాలు మిత్రపక్షాలుగా కలిసి పోటి చేసి అధికారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా?

అప్పటి నుండి కార్పొరేషన్లను భర్తీ చేసినపుడల్లా తమకు కూడా అవకాశం ఇవ్వాలని భాజపా నేతలు ఎంత అరిచి గీ పెట్టినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఇదే విషయాన్ని పలుమార్లు కమలనాధులు ఢిల్లీలోని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసారు. అయితే, చంద్రబాబుకు దన్నుగా మరో నెల్లూరు నాయడున్న కారణంగా ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో చేసేది లేక మాట్లాడకుండా కూర్చున్నారు.

అయితే, తాజా నియమాకాల్లో ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి భాజపాకు దక్కినందుకు కమలనాధులు ఆశ్చర్యపోయారు. గుంటూరు జిల్లా నేత డాక్టర్ లక్ష్మీపతికి మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. భాజపా నేతకు కార్పొరేషన్ ఎందుకు ఇచ్చారబ్బా అని ఆరాతీస్తే, సదరు నేత నెల్లూరు నాయడుగారికి చాలా సన్నిహితుడని తేలింది.

అంటే వచ్చిన ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా భాజపా కోటాలో కాకుండా నాయుడుగారి కోటాలో వచ్చిందట. దాంతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారట. ఎందుకైనా మంచిదని మిత్రపక్షానికీ ఓ కార్పొరేషన్ పడేసారు. సరే, భాజపా కోటా అయినా నాయుడుగారి కోటా అయినా మొత్తానికి మిత్రపక్షానికి ఇచ్చినట్లే కదా అని టిడిపి నేతలంటున్నారు. అదీ నిజమేకదా?