Asianet News TeluguAsianet News Telugu

ప్రజల మద్దతుతోనే భారీ మెజారిటీ: ఆత్మకూరులో విజయం తర్వాత మేకపాటి విక్రంరెడ్డి

ప్రజల మద్దతుతోనే తాను భారీ మెజారిటీతో విజయం సాధించినట్టుగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రం రెడ్డి చెప్పారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మేకపాటి విక్రంరెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. 
 

BJP Allegations Baseless  says Atmakur MLA Mekapati Vikram Reddy
Author
Nellore, First Published Jun 26, 2022, 12:38 PM IST

నెల్లూరు: ప్రజల మద్దతుతోనే తాను భారీ మెజారిటీతో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్టుగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రంరెడ్డి చెప్పారు.atmakur bypoll results 2022  విజయం సాధించిన తర్వాత ఆదివారం నాడు ఆయన ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు Mekapati Gautham Reddy పై ఉన్న అభిమానంతో ప్రజలు తనకు ఓట్లు వేశారని ఆయన చెప్పారు. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని విక్రంరెడ్డి చెప్పారు. ఓటమి కారణంగానే తమపై BJP నేతలు ఆరోపణలు చేస్తున్నారని  Mekapati Vikram Reddy మండిపడ్డారు. 

ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను CM  దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ఆయన చెప్పారు. విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి Bharath kumar ‌కు 19,352‌ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రౌండ్ నుండి వైసీపీ అభ్యర్ధి విక్రం రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు.  తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 

ఈ ఏడాది జూన్ 23 ఆత్మకూర్ లో ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరిగింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గత 2019 ఎన్నికల్లో ఆత్మకూర్‌లో 83.32శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 64.14శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ ఉపఎన్నికలో టీడీపీ  పోటీ చేయలేదు. బీజేపీ,,  బీఎస్పీ లను బరిలోకి దింపాయి. ఈ రెండు పార్టీలతో పాటు మరో పది మందికిపైగా ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలిచారు. 

మరణించిన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపిన సమయంలో పోటీకి నిలపకూడదని గతం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో  మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించాడు. . హైద్రాబాద్ లోని తన నివాసంలో మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది

also read:Atmakur by election Result 2022: వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం.. మెజారిటీ ఎంతంటే..?

ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో అన్ని రకాలుగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ ఆరోపించారు. వలంటీర్లు వైసీపీ కూడా ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios