విశాఖపట్టణం:వచ్చే ఎన్నికల్లో  తాను విశాఖపట్టణంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక స్పష్టం చేస్తానని ఆయన ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో  బీజేపీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదన్నారు. బీజేపీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని  విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత కారణాలతో కొందరు నేతలు బీజేపీని వీడారని ఆయన అభిప్రాయపడ్డారు. 

వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి అనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టలేదు. విష్ణుకుమార్ రాజు కూడ బీజేపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో  విష్ణుకుమార్ రాజు  ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోపీడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీలో కీలకమైన బీజేపీ నేతలు  కొందరు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం  జోరుగా సాగుతోంది.