Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ రామ్మోహన్ నాయుడికి సొంత జిల్లాలో చేదు అనుభవం (వీడియో)

రామ్మోహన్ నాయుడికి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. 

bitter experience to tdp mp rammohan naidu in srikakulam
Author
Hyderabad, First Published Oct 22, 2018, 1:50 PM IST

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చిన పనిపూర్తవకుండానే ఎంపీ వెనుదిరగాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. సోమవారం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామంలోని తుఫాను బాధితులను పరామర్శింటానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని, నీళ్లు ఇతర అవసరాలను తీర్చిందని చెబుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు.

తమకు ఎలాంటి సహాయం అందలేదని, విద్యుత్‌ సౌకర్యం ఇప్పటివరకు పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట అంచాన వేయటానికి ఏ ఒక్క అధికారి కూడా ఊరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారిని నిలదీశారు. దీంతో ఆయన అక్కడి వెళ్లిపోయారు.

                         "

Follow Us:
Download App:
  • android
  • ios