Badvel bypoll: బిజివేముల కోట 'బద్వేల్', కాంగ్రెసేతర పార్టీలదే ఆధిపత్యం
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు దఫాలు బిజివేముల వీరారెడ్డి విజయం సాధించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రేసేతర పార్టీల అభ్యర్ధులే ఎక్కువ దఫాలు విజయం సాధించారు. ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
బద్వేల్: కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర పార్టీ అభ్యర్ధులే ఎక్కువ దఫాలు విజయం సాధించారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దింపింది ycp. ఈ నెల 30 వ తేదీన బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
also read:బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెసు: అభ్యర్థిగా కమలమ్మ
ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జనసేన, టీడీపీ నిర్ణయం తీసుకొన్నాయి. అయితే Badvel bypoll లో పోటీ చేయాలని congress , బీజేపీ నిర్ణయం తీసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కమలమ్మను ఆ పార్టీ గురువారం నాడు ప్రకటించింది. BJP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం నలుగురి పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపింది. ఇవాళ లేదా రేపో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి పేరును బీజేపీ నాయకత్వం ప్రకటించనుంది.
బద్వేల్‌లో ఐదు దఫాలు ఎమ్మెల్యేగా బిజివేముల వీరారెడ్డి
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో bijivemula veera Reddy ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టుంది. 1955 లో తొలిసారిగా ఈ స్థానానికి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధిగా బండారు రత్నశబ్దపతి శెట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వడ్డెమాను చిదానందం 1962లో గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బివీ రెడ్డి విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బిజివేముల వీరారెడ్డి గెలుపొందారు. 1978లో వడ్డెమాను శివరామకృఫ్ణారావు జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.
1983లో బిజివేముల వీరారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 1985లో బిజివేముల వీరారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వడ్డెమాను శివరామకృష్ణారావు గెలుపొందారు.1994లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వీరారెడ్డి మరోసారి విజయం సాధించారు. 1999లో ఇదే స్థానం నుండి బిజివేముల వీరారెడ్డి గెలుపొందారు. 2000 లో ఆయన మరణించారు. వీరారెడ్డి కూతురు విజయమ్మ ఆయన వారసురాలిగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నారు. గతంలో ఆమె ఎమ్మెల్యేగా కూడ పనిచేశారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దేవసాని చిన్న గోవిందరెడ్డి గెలపొందారు.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పీఎం కమలమ్మ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన త్రినిధి జయ రాములు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వీడి టీడీపీకి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వెంకట సుబ్బయ్య విజయం సాధించారు.
2004 నుండి ఈ స్థానం నుండి కాంగ్రెస్, వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. టీడీపీకి మాత్రం స్థానం దక్కలేదు.అయితే ఇటీవల కాలంలో ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ.