Asianet News TeluguAsianet News Telugu

అమరావతి భూముల కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట.. తొందరపాటు చర్యలొద్దు , సీఐడీకి హైకోర్ట్ ఆదేశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో తొందరపాటు చర్యలొద్దని సీఐడీ ఆదేశించింది

big relief for former minister narayana in ap high court
Author
First Published Feb 21, 2023, 6:02 PM IST | Last Updated Feb 21, 2023, 6:02 PM IST

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. 2020 నాటి సీఐడీ కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు 41ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీకి సూచిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు 3 వారాలు వాయిదా వేసింది. 

ALso REad: అమరావతి అసైన్డ్ భూముల కేసు .. హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ , మాజీ మంత్రి నారాయణ కంపెనీల్లో తనిఖీలు

కాగా.. అమరావతి ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నారాయణపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సీఐడీ వర్గాల ప్రకారం..  రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి నారాయణ, మరికొందరు మంత్రులు, వారి బినామీలు.. ఆ భూములకు సంబంధించి  ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పథకం కింద ప్రభుత్వం తీసుకుంటుందనే భయం నెలకొలిపి కాజేశారు. ఆ తర్వాత వారి నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. అనంతరం మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్‌ భూములకు ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2016లో జీఓ 41 జారీ చేయాలని మంత్రులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios